hari-krishna-jai-lava-kusa- jr-ntrయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న “జై లవకుశ” సినిమాకు సంబంధించి ఓ స్టిల్ సోషల్ మీడియాలో విడుదలై చక్కర్లు కొడుతోంది. అధికారిక స్టిల్ కాకపోయినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సెట్స్ కు విచ్చేసిన నేపధ్యంలో ఈ స్టిల్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన ఈ ఫోటోతో యంగ్ టైగర్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఈ ఫోటో ద్వారా స్పష్టమైన మరొక విషయం ఏమిటంటే… ఒక ఎన్టీఆర్ పాత్ర పేరు ‘ఎన్.లవకుమార్’ అని!

అయితే హరికృష్ణ రాకపై రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. అందులో ప్రధానంగా ఈ సినిమాలో హరికృష్ణ ఓ అతిథి పాత్ర పోషిస్తున్నారని, అందులో భాగంగా ఈ స్టిల్ విడుదలైందని ప్రచారం జరిగింది. కానీ, తాజా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు… ఈ సినిమాలో హరికృష్ణ ఎలాంటి పాత్ర పోషించడం లేదు. కేవలం తన తనయుడి సినిమా షూటింగ్ ను చూసేందుకు మాత్రమే ఇక్కడికి విచ్చేశారు. ఒక తనయుడు ఈ సినిమాను నిర్మిస్తుంటే, మరో తనయుడు మూడు పాత్రలను పోషిస్తుండడంతో హరికృష్ణ మిక్కిలి సంతోషంతో కనపడుతున్నారు.