hari-krishna-avoids-balakrishna“నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుక ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఏదైనా సినిమా ఆడియోను ముఖ్య అతిథి విడుదల చేసిన తర్వాత సి.డి.లను ఒకరిద్దరికీ పంచడం ఆనవాయితీ. అయితే “నాన్నకు ప్రేమతో” వేడుకపై మాత్రం అన్నీ సి.డి.లను స్వయంగా హరికృష్ణ చేతుల మీదుగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి అందరికీ ఇప్పించడం విశేషం.

ఇక, ఆ తర్వాత ప్రసంగించిన హరికృష్ణ వ్యాఖ్యలు పలు చర్చలకు దారి తీసాయి. విచ్చేసిన అతిధులకు, ప్రేక్షక దేవుళ్లకు వందనాలు అంటూ ప్రారంభించిన హరికృష్ణ… ప్రత్యేకంగా అభిమానులను ఉద్దేశించి… “నందమూరి అభిమానులకు, జూనియర్ అభిమానులకు, కళ్యాణ్ రామ్ అభిమానులకు… పాదాభివందనాలు” అంటూ ప్రారంభించారు. ప్రసంగం ప్రారంభంలోనే ఆసక్తికరమైన ప్రకటనలు చేయడంతో… హరికృష్ణ చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆద్యంతం ఇంకేమి విషయాలు చెప్తారా అని అభిమానులు చాలా శ్రద్ధగా విన్నారు.
నందమూరి అభిమానులు, జూనియర్ అభిమానులు అని ప్రత్యేకంగా సంభోధించిన హరికృష్ణ, ‘బాలకృష్ణ అభిమానుల’ను మాత్రం విస్మరించడం గమనించదగ్గ విషయం. ఒకవేళ నందమూరి అభిమానుల్లోనూ బాలయ్యను కలిపితే, మరి జూనియర్ ను, కళ్యాణ్ రామ్ ను నందమూరి వర్గం నుండి వేరు చేసినట్టా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారా? అలాంటి కళ్యాణ్ రామ్ కు కూడా స్పెషల్ అభిమానులు ఉన్నట్లు పలికిన హరికృష్ణ… తన సోదరుడు నందమూరి నటసింహం అభిమానులను ప్రస్తావించకపోవడం కేవలం కాకతాళీయమా? లేక ఉద్దేశపూర్వకమా? జవాబు ఇంకా కావాలంటారా..?

ఇదే సంక్రాంతికి “నాన్నకు ప్రేమతో” పాటు బాలయ్య “డిక్టేటర్” సినిమా కూడా విడుదల కానున్న నేపధ్యంలో… “ఈ సంక్రాంతికి వస్తున్న రెండు నందమూరి సినిమాలను ఆదరించండి” అని కనీసం ఒక్కసారి కూడా ఎవరూ ప్రస్తావించక పోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి..?

talk