Happy -Wedding Movie music reviewసుమంత్ అశ్విన్, మెగా డాటర్ నిహారిక జంటగా నటిస్తోన్న “హ్యాపీ వెడ్డింగ్” సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో… ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ విడుదల కాగా, ప్రస్తుతం ఒక్కో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా విడుదలైన ‘కాదని నువ్వంటున్నది’ అనే మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది.

సాహిత్య మాంత్రికుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం, సినిమాలో సిట్యూయేషన్ కు తగ్గట్లుగా వినపడుతోంది. సిరివెన్నెల సాహిత్యాన్ని హేమచంద్ర, శ్రావణ భార్గవిలు మరో స్థాయికి తీసుకెళ్ళారు. శక్తికాంత్ కార్తిక్ అందించిన మెలోడీ ట్యూన్ వినడానికి ఆహ్లాదకరంగా, మళ్ళీ వినాలనిపించేలా ఉంది. యువీ క్రియేషన్స్ సంస్థ ప్రజెంట్ చేస్తోన్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.