Happy - Wedding movie collectionsమెగా కాంపౌండ్ నుండి హీరోలుగా అడుగుపెట్టిన వారంతా ఇప్పటివరకు ఎంతో కొంత గుర్తింపును తెచ్చుకున్నవారే. ఇటీవల ‘విజేత’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని పక్కన పెడితే, అంతకుముందు వారిలో ఒక్క అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ మినహా మిగిలిన వారు హీరోలుగా దాదాపుగా ఎస్టాబ్లిష్ అయిన వారే.

ఆ మెగా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంట్రీ ఇచ్చిన నిహారికకు మాత్రం తొలిసినిమా “ఒక మనసు” పెద్ద షాక్ ఇచ్చింది. నాగశౌర్యతో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావితం చూపలేకపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని “హ్యాపీ వెడ్డింగ్” రూపంలో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాకు కూడా అదే రకమైన ఫలితం రావడం విశేషం.

సాధారణంగా మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చే వారికి మెగా ఫ్యాన్స్ అండదండలు పుష్కలంగా ఉంటాయి గనుక, మినిమం ఓపెనింగ్స్ దక్కుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తాయి. కానీ నిహారిక రెండు సినిమాలకు మెగా ఫ్యాన్స్ సహకారం లేదన్న విషయం ఓపెనింగ్సే చెప్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ, ప్రేక్షకులను రాబట్టడంలో “హ్యాపీ వెడ్డింగ్”విఫలం అయ్యిందనేది ఫస్ట్ 2 డేస్ కలెక్షన్స్ చెప్తోన్న మాట.