Happy News In Jr NTR Householdయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట మరో బుల్లి వారసుడు ప్రత్యక్ష్యం అయ్యాడన్న విషయం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. లక్ష్మీ ప్రణతి బాబుకు జన్మినిచ్చిన విషయాన్ని ఎన్టీఆర్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా పేర్కొనడంతో ఈ సారి శుభాకాంక్షలు చెప్పే వారి జాబితాలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ‘తన ఫ్యామిలీ పెద్దది అయ్యింది, ఇట్స్ ఎ బాయ్’ అంటూ తారక్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, హంసా నందిని, మంచు మనోజ్ కుమార్, నాని తదితరులతో పాటు, ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ చిత్రంలో నటించిన నివేతా థామస్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ నిర్మిస్తోన్న డివివి దానయ్య అండ్ కోలు జూనియర్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. మొత్తానికి ఈ ‘రాముడు’కు సెలబ్రిటీల ఆశీర్వాదాలు అప్పుడే అందేసాయి.