hanuma vihari twitter controversyఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ గా మారిందో అని చెప్పడానికి మరో నిదర్శనంగా ఈ ఘటన నిలుస్తుంది. ఇప్పుడిప్పుడే క్రికెట్ కెరీర్ ఆరంభించిన హనుమ విహారి, కరోనా సమయంలో తన ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలతో ఒక క్రికెటర్ గానే కాకుండా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను తప్పుపడుతూ వేసిన ఒక్క ట్వీట్ ఆ ఫౌండేషన్ ను కుదిపేసింది. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని, జరిగిన దానికి క్షమాపణలు చెప్తూ వివరణ ఇచ్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో జరిగిన రచ్చతో ఇకపై తాము ఎలాంటి సేవ కార్యక్రమాలను నిర్వహించబోమని చెప్తూ… ఏకంగా ట్విట్టర్ ఖాతాను కూడా తొలగించారు.

సోషల్ మీడియాలో రకరకాల మనుషులు ఉంటారు, అలాగే చాలా ఫేక్ ఖాతాలు కూడా ఉంటాయన్న సంగతి విదితమే. ఎవరో పనికట్టుకుని విహారి ఫౌండేషన్ ను విమర్శిస్తే దానికి తాను చేసే సేవా కార్యక్రమాలను నిలిపివేయడం అనేది సరైన నిర్ణయం కాదు, అది ఎంత మొత్తమైనా! ఎంత చిన్నదైనా!

నిజానికి జరిగిన తప్పును తెలుసుకుని వేసిన ట్వీట్ కు, ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా రిప్లై విహారి ఫౌండేషన్ చేస్తున్న సహాయాన్ని అభినందించింది. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నా, లేకున్నా… ఒక మంచి పని చేస్తుంటే దానిని అభినందించాలే గానీ, విరుచుకుపడిపోకూడదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా… ఎంతటి వారైనా..!