విక్టరీ వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో హార్స్ రేసింగ్ మీద సినిమా తీస్తారని అందరూ అనుకుంటుండగా ఆయన ఉన్నట్టుండి తెర మీదకు అసురన్ రీమేక్ ను తెచ్చారు. ధనుష్ నటించిన అసురన్ అనే సినిమా చూసి వెంకటేష్ బాగా ఎక్సైట్ అయ్యారట. సురేష్ బాబు, తమిళంలో నిర్మించిన కలైపులి తాను ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అవార్డు విన్నింగ్ సినిమాల దర్శకుడు వెట్రి మారన్ తీసిన తమిళ చిత్రం అది. ఆయన రేంజిలో తీయాలంటే కష్టమే. ఆయననే ఈ సినిమాకు తీసుకోవాలని అనుకున్నా అందుకు ఆయన నో చెప్పారట. భాష ఇబ్బంది వల్ల ఈ సినిమా నేను చెయ్యలేను అని ఆయన చెప్పేశారట. నిన్నటిదాకా వినాయక్, క్రిష్ పేర్లు వినపడగా తాజాగా ఇంకో పేరు తెర మీదకు వచ్చింది.
హను రాఘవపుడిని డైరెక్టర్ గా కంఫర్మ్ చేశారట. హను ఇటువంటి సినిమాలకు సరిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఆయనకు హిట్ అనేది లేదు. ఈ తరుణంలో ఆయనకు సినిమా ఇస్తే హైప్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. వినాయక్ గానీ క్రిష్ గానీ అయితే ఓపెనింగ్ ఉంటుంది. దీనితో అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చుసేధోరణిలో ఉన్నారు అభిమానులు.
వెంకటేష్ నటించిన వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే సినిమా రిలీజ్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించలేదు. మొదట్లో సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరిగినా డిసెంబర్ లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Three Years Of Jagan: Record Majority To Unbelievable Fall
Bunny Is Now Nandamuri Allu Arjun!