Hansika Motwani Accused of Non-Payment“నా అభిమానులందరికీ ఓ సర్ ప్రైజ్ ఉంది… ఆగష్టు 9వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా ల్యాండ్ మార్క్ మూవీ సినిమా టైటిల్ ను ప్రకటించబోతున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా ముద్దుగుమ్మ హన్సిక తన అభిమానులకు ఓ సందేశాన్నిచ్చింది. ఇప్పటికే ఆగష్టు 9వ తేదీన హంగామాకు ప్రిన్స్ ఫ్యాన్స్ సిద్ధం కాగా, ఇక అందులో హన్సిక కూడా భాగస్వామ్యం కాబోతోందన్న మాట.

పూరీ జగన్నాధ్ “దేశముదురు” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక, ఆ తర్వాత చాలా అవకాశాలను పొందింది గానీ, సక్సెస్ రేటు మాత్రం పొందలేకపోయింది. దీంతో టాలీవుడ్ లో కనుమరుగైన ఈ బొద్దుగుమ్మ, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ‘జూనియర్ ఖుష్బూ’గా తమిళ ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటోన్న హన్సిక, ల్యాండ్ మార్క్ మూవీ సూపర్ హిట్ కావాలని ఆశిద్దాం.