hamsa nandini bungy jumpమెగాస్టార్ చిరంజీవి ‘బావగారు… బాగున్నారా…’ సినిమాతో తెలుగునాట ఒక్కసారిగా పాపులర్ అయిన ‘బంగి జంప్’ ఫీట్ కు అభిమానులంతా మంత్రముగ్ధులయ్యారు. నిపుణుల పర్యవేక్షణలో చేసిన ఇదే ఫీట్ ను ప్రిన్స్ మహేష్ బాబు తన రెండవ సినిమా “యువరాజు” సందర్భంగా రిపీట్ చేసి సంచలనం సృష్టించారు. ఈ ఇద్దరూ హీరోలు చేసిన ‘బంగి జంప్’ ఫీట్ ను తాజాగా ఐటెం సాంగ్ లతో టాలీవుడ్ లో తన హావా కొనసాగిస్తున్న హంసానందిని చేయడం విశేషం.

న్యూజిలాండ్ వేదికగా దాదాపు 134 ఎత్తు నుండి దూకి, హీరోలకు తానూ ఏ మాత్రం తీసిపోనూ అని చాటిచెప్పింది హంసా. చిరు, మహేష్ లిద్దరూ ఒక బ్రిడ్జ్ పై నుండి ఈ ‘బంగి జంప్’ ఫీట్ ను చేయగా, హంసా నందిని మాత్రం లోయలలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో చేసి సత్తా చాటడం ప్రత్యేకంగా నిలిచింది. వెండితెరపై హాట్ హాట్ సోయగాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ ఫీట్ చూసి ‘ఔరా…’ అనుకోవడం ఆడియన్స్ వంతవుతోంది. దీంతో చిరంజీవి, మహేష్ చేసిన ‘బంగి జంప్’ కంటే హంసా నందిని చేసిందే గొప్పగా ఉందని కితాబిస్తున్నారు నెటిజన్లు.