GVL-Narsimha-Rao-తెలుగుదేశం పార్టీ తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే అది వారికే అంటుకుంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో ఫోన్‌ సంభాషణలు వెలుగులోకి వస్తే తెదేపా నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని జీవీఎల్‌ ప్రశ్నించారు.

ఈ అంశాన్ని రాజకీయంగా తాము లేవనెత్తలేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంబర్‌వన్‌గా ఉందని విమర్శించారు. జీవీఎల్‌ లేవనెత్తుతున్న ఈ అంశాలు అన్ని చాలా హాస్యాస్పదంగా ఉన్నవి. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రుజువులు, విచారణ లేకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షిస్తారా అనేది వారు ఆలోచించుకోవాలి.

చాలా రాష్ట్రాల్లో భాజపాను తక్కువగా అంచనా వేసిన పార్టీలు ఇప్పుడు తుడుచుపెట్టుకుపోయాయని.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. తెదేపా నేతలు చేసే ఆరోపణలను తాము పట్టించుకోమని.. రాష్ట్రంలో తమ పార్టీ అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. పట్టించుకోము అంటూనే పూటకో ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నట్టో మరి!