GVL Narasimha RaoSupports ysrcp on visakhapatnam issueమొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. హై కోర్టుకూడా ఇప్పటికే ఈ విషయంగా పోలీసులకు మొట్టికాయలు వేసింది. అయితే కోర్టులు కూడా తప్పుపట్టిన ఈ విషయంపై బీజేపీ స్పందన విడ్డూరంగా ఉండటం గమనార్హం.

తెలుగుదేశం పార్టీ నేతల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌‌ను కలిసి విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎవరో చెప్పినట్టు, ఎవరో పంపినట్టు రాజ్ భవన్ దగ్గర వాలిపోయారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటి అయ్యారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్తుతులను గవర్నర్ కు వివరించారు… సమావేశం అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాడుల సంస్కృతి మొదలు పెట్టిందే టీడీపి అన్నారు.

శాంతిభద్రతలు అదుపు తప్పేలా పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని గవర్నర్‌ కు వివరించినట్టు తెలిపారు. జీవీఎల్ నరసింహారావు వైఖరి, వ్యాఖ్యలు ప్రభుత్వం మీద పూర్తిగా తప్పు పడకుండా, టీడీపీని కూడా ఈ వివాదంలోకి లాగి అధికారపక్షానికి మేలు చేస్తున్నదిగా ఉన్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.