GVL Narasimha Rao likely to be BJP rajya sabha candidateబిజెపి అదికార ప్రతినిది జివిఎల్ నరసింహారావు ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు తీసుకు రావాలని బిజెపి నిర్ణయించింది. ప్రజాభిప్రాయ క్రోడికరణ రంగంలో పేరొందిన నరసింహారావు బిజెపి జాతీయ అధికార ప్రతినిదిగా ఉన్నారు. 2011 లోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పిన జివిఎల్ మద్యప్రదేశ్ ప్రభుత్వానికి చాలాకాలం సలహాదారుగా వ్యవహరించారు.

నరసింహారావు బీజేపీలో జగన్ కు అనుకూలనాయకుడుగా సుపరిచితుడు. 2014కు ముందు ఆయన బీజేపీ వైకాపా పొత్తు కుదర్చడానికి చాలా గట్టిగా కృషిచేశారు. జగన్ వద్దకు రాయభారానికి కూడా వెళ్లారు. అయితే మైనారిటీ ఓట్లు పోతాయని జగన్ అప్పట్లో దానికి ఒప్పుకోలేదు. టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడం రానున్న పరిణామాలకు అద్దం పడుతుంది.

మరోవైపు నిన్న రాష్ట్ర బీజేపీ నేతలు జగన్ పై ప్రశంసలు కురిపించారు. కేంద్రంపై వైకాపా అవిశ్వాస తీర్మాణం పెడతాం అని ప్రతిపక్షపార్టీ ప్రకటించినా జగన్ ను పొగడటం అంటే ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతుందనే అనుమానాలు అందరిలోనూ ఉన్నవి.