BJP - GVL Narasimha Raoవిజయవాడ వచ్చిన గవర్నర్ నరసింహన్ ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలోని బీజేపీ నాయకుల బృందం కలిసి పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ చేయించాలని వినతి పత్రం సమర్పించారు. ఆ తంతు ముగిసిన మరునాడే అంటే ఈరోజు చంద్రబాబుకు దమ్ముంటే పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు.

ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలలో పసలేదని పరిశీలకులు తేల్చి చెప్పారు. పీడీ అకౌంట్లు ఎక్కువ ఉన్నాయి అంటే అది అవినీతి చేసినట్టు కాదని, మహా అయితే కొంత ఆర్ధిక క్రమశిక్షణ లేనట్టు అని వారు చెప్పుకొచ్చారు. అయినా జీవీఎల్ నరసింహారావు ఏదో విధంగా ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని పలచన చెయ్యాలని చూస్తున్నట్టుగా ఉంది.

నిజంగా వారిదగ్గర సాక్ష్యాలు ఉంటే కేంద్రం ద్వారా సీబీఐ విచారణ చేయించవచ్చు. దానికి చంద్రబాబును లేఖ రాయమనడం ఎందుకో? సాక్ష్యాలు లేకుండా సీబీఐ విచారణ చేయిస్తే కోర్టు మొట్టికాయలు వెయ్యొచ్చు, అదే జరిగితే చంద్రబాబు మీద ప్రజలకు సింపతీ కలుగుతుందని వారి భయమేమో!