GVL Narasimha rao comments on Chandrababu naidu politicsనాలుగు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు బీజేపీ వారికి సరిపోలేదనుకుంటా. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ఆర్థికశాఖతో సంప్రదింపులు జరపకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు ఆరోపించారు. నిధుల సమస్యల్ని నీతి ఆయోగ్‌పాలక మండలి సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నాయుడు ఇంతకాలం ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

కేంద్రం నుంచి నిధులు రాబెట్టుకొనేందుకు గత రెండు నెలలుగా ఏం ప్రయత్నం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రావాల్సిన నిధుల గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులైనా జరిపారా? కనీసం ఒక లేఖైనా రాశారా? అని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖకు ఎలాంటి నివేదిక సమర్పించారో బహిర్గతం చేయాలన్నారు. భాజపాకు రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని జీవీఎల్‌ పునరుద్ఘాటించారు.

నాలుగు సంవత్సరాలుగా జరిపిన సంప్రదింపులు సరిపోలేదా? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిధులు ఇవ్వొచ్చు కదా? చంద్రబాబు మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరిగితే రాష్ట్రానికి కేంద్రం ఏదో చేసేస్తోందని చెప్పుకోడానికి వీలుంటుందని బీజేపీ భావిస్తుందా?