gvl narasimha rao -BJPమండలి రద్దుని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం ఇప్పటికే కేంద్రానికి చేరింది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ పాస్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంది. అక్కడ పాస్ అయితే ప్రెసిడెంట్ ఆమోదముద్ర వేస్తారు. అప్పుడే మండలి అధికారికంగా రద్దు అవుతుంది.

అయితే కేంద్రం వెంటనే ఆమోదిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తుండగా, టీడీపీ మాత్రం ఈ తతంగం అంతా పూర్తి కావడానికి ఏడాది పైనే పడుతుంది అని అనుకుంటుంది. ఈ తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానానికి పార్లమెంటులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ ఉండవకపోవచ్చని ఆయన అన్నారు.

శాసనసభ చట్టబద్దంగా ఈ తీర్మానం చేసిందని ఆయన అన్నారు. ఇది పార్లమెంటులో ఆమోదం పొందవలసి ఉందని ఆయన అన్నారు. అయితే ఉద్దేశ పూర్వకంగా కేంద్రం ఈ తీర్మానాన్ని ఆలస్యం చేయదని ఆయన స్పష్టం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడదని జివిఎల్ స్పష్టం చేశారు.

అదే సమయంలో మండలి అనే విషయంపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని స్టాండింగ్ కమిటి చెప్పిన దానిపై కూడా ఆయన స్పందించారు. .పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సలహాలు మాత్రమే ఇస్తుందని ఆయన అన్నారు. అంటే దీని అర్దం మండలి రద్దుకు బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అనుకోవాలా? అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.