GVL Narasimha Rao allegations on chandrababu naidu corruptionభారతీయ జనతా పార్టీ తీరు మాటలు కోటలు దాటుతున్నాయి గానీ కాళ్ళు గడపలు దాటవు అన్న చందాన ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాపాల చిట్టా తన వద్ద ఉందని, పార్లమెంటులోనే దానిని విప్పుతామని మరో సారి ప్రగల్బాలు పలుకుతున్నారు ఆ పార్టీ ఎంపీ జివీఎల్ నరసింహారావు.

గతంలో కూడా ఇదే నరసింహారావు కర్నాటక ఎన్నికలు పూర్తవగానే బ్రహ్మాండం బద్దలవుతుంది అని హడావిడి చేశారు. తరువాత ఏమీ జరగలేదని మన అందరికి తెలిసిందే. ఒకవేళ నిజంగా చంద్రబాబు అన్ని పాపాలే చేసి ఉంటే మరి ఈ నాలుగేళ్లు ఆ చిట్టా దగ్గర పెట్టుకుని ఏమి చేశారో. టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాకే ఆ చిట్టా దొరికింది అని అంటే అది బీజేపీ తప్పే కదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే వివిధ పక్షాలకు చెందిన సభ్యులు సభలో నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాల కోసం సభ్యులు పట్టుబట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తెదేపా సభ్యులు పట్టుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సభలో నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.