Gunjan-Saxena-The-kargil-Girl---Janhvi-Kapoor-Netflix-Releaseశ్రీదేవి కుమార్తె, జాన్వి కపూర్ తదుపరి చిత్రం, గుంజన్ సక్సేనా, దాని థియేట్రికల్ విడుదలను దాటవేసి నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల అవ్వబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క స్ట్రీమింగ్ హక్కులను పొందింది. అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇది ఇలా ఉండగా… గుంజన్ సక్సేనా హక్కులను నెట్ ఫ్లిక్స్ 70 కోట్లకు దక్కించుకున్నట్టు వెలుగులోకి వస్తోంది.

కానీ, ఈ సినిమాకు కేవలం 30 కోట్లు ఖర్చయ్యిందట. అదే నిజమైతే ఈ సినిమా నిర్మాతలకు బాగా పనయినట్టే. కార్గిల్ యుద్ధంలో యుద్ధంలో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా యొక్క పాత్రలో జాన్వీ నటిస్తుంది. గతంలో, జాన్వి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఘోస్ట్ స్టోరీస్‌లో నటించారు.

భారతదేశపు మొట్టమొదటి మహిళా పోరాట ఏవియేటర్లపై 1999 ఎన్డిటివి నివేదిక ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. శరణ్ శర్మ, నిఖిల్ మెహ్రోత్రా కలిసి రచించిన ఈ చిత్రంలో వినీత్ కుమార్, మానవ్ విజ్ కూడా నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకున్నారు.

ఆ తరువాత ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. కరోనాతో థియేటర్లు మూతపడటంతో విడుదల సాధ్యపడలేదు. అందుకని ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చెయ్యనున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తెస్తుందని జాన్వీ చాలా ఆశలే పెట్టుకుంది.