Rudhramadevi, Rudhramadevi Oscar, Rudhramadevi Oscar Race, Rudhramadevi Movie Oscar Race, ‎Gunasekhar Rudhramadevi Movie Oscar Race, Anushka Shetty Rudhramadevi Movie Oscar Race,సుప్రసిద్ధ దర్శకుడు గుణశేఖర్ స్వీయనిర్మాణ దర్శకత్వంలో ఎంతో వ్యయప్రయాసలకు ఓడ్చి తెరకెక్కించిన “రుద్రమదేవి” సినిమా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుందని స్వయంగా గుణశేఖర్ ప్రకటించారు. ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో ‘రుద్రమదేవి’ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసిందని, దీంతో ‘రుద్రమదేవి’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

2015లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే స్థానికంగా పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫలితం, ప్రోత్సాహంతో మరో చారిత్రాత్మక సినిమాకు గుణశేఖర్ శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు. రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు జీవితగాధ ఆధారంగా తెరకెక్కించాలనే ప్రయత్నంతో, దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సంగతులు అతి త్వరలోనే బయటకు వెల్లడి కానున్నట్లు సమాచారం.