gudivada-kodali-nani-sankranthi-sambaralu-2022చింతామణి నాటక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎవరూ విమర్శలు వ్యక్తం చేయలేదు గానీ, ఎన్నో ముఖ్యమైన అంశాలను రద్దు చేస్తామని చెప్పి, చివరికి చింతామణి నాటకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్న విమర్శలకైతే కొదవలేదు.

ఈ రద్దు చేస్తామన్న అంశాలలో… ఉద్యోగస్తుల సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం ప్రధానమైనవి. అధికారంలోకి రావడానికి ప్రధాన ఆయుధాలుగా వినియోగించిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చేతులెత్తేసిన వైనం తెలిసిందే. అలాగే ఒకప్పుడు శాసనమండలిలో తమకు తగినన్ని స్థానాలు లేవని రద్దు చేస్తామని చెప్పి, చివరికి ఏం చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇన్ని అంశాలపై మడమ తిప్పిన జగన్ సర్కార్ చివరికి చింతామణి నాటకాన్ని రద్దు చేసిందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తాజాగా ఇదే అంశాన్ని ఉదహరిస్తూ ప్రముఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఓ ట్వీట్ చేసారు. గోవా మాదిరి ఇటీవల గుడివాడలో జరిగిన వీడియోను పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో ప్రభుత్వ తీరును ఏకరువు పెట్టారు.

“ప్రభుత్వం చింతామణి నాటకాన్ని రద్దు చేసినా, జనరంజక శృంగార నాట్యాలకి తెరతీసి నాటక రంగాన్ని ఉద్ధరించే పని మొదలెట్టింది. ప్రభుత్వ, పోలీసు సహకారాలతో బొడిలింగాలు కేసినోలు, పబ్బులు, క్లబ్బులు పెట్టి, ప్రజలకి పన్నుల నొప్పి తెలియకుండా చేస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

https://twitter.com/bolisetti_satya/status/1484354441176580098