Gudivada-Amarnathహైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదిస్తూ న్యాయవ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడికి పాల్పడుతున్నారంటూ హైకోర్టు దాదాపుగా 100కి నోటీసులు జారీ చేసింది. అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్‌కు కూడా హై కోర్టు నోటీసులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ కేసు కోర్టు సిబిఐకి అప్పగించడం తప్పు పడుతూ చంద్రబాబు కనుసన్నల్లో కోర్టులు నడుస్తున్నాయి అంటూ వ్యాఖ్యలు చేసారు ఆయన.

తాజాగా తాను ఎమ్మెల్యేగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఓ బాధ్యత గల పౌరుడిగా తన అభిప్రాయం మాత్రమే చెప్పానన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారతదేశంలో ఆ పాటి స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. న్యాయస్థానం తనను పిలిచి బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తే…ఇదే సమాధానం చెబుతానని వివరించారు.

నిజంగా అటువంటి సమాధానమే చెబితే ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే కోర్టు జారీ చేసిన నోటిసులలో 2-3 నాయకులు, ఒకరిద్దరు జర్నలిస్టులు తప్ప మిగతా అందరు సామాన్యులే (అందులో చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ డిజిటల్ వింగ్ లో పని చేస్తున్న వారే). అయినా నోటీసులు వచ్చాయి.

సామాన్యులకు ఒకలాగా, ఎమ్మెల్యేలకు ఒక లాగా రూల్స్ ఉండవని అమర్ మర్చిపోయినట్టు ఉన్నారు. మరోవైపు…. నోటీసులు అందుకున్న చాలా మంది తమ సోషల్ మీడియా అకౌంట్లు డిలేట్ చేసుకుని మాయం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో సీఐడీ పోలీసులు ట్విట్టర్, పేస్ బుక్లను సంప్రదించి వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.