Greeshma -Kaavali TDPఆంధ్రప్రదేశ్ లో మహిళల పట్ల వైసీపీ నాయకులు ప్రవరిస్తున్న తీరు ఇటీవల కాలంలో మరింత చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ నాయకులే కాదు చివరికి పార్టీ అధికార ప్రతినిధిగా మీడియా డిబేట్స్ లో వచ్చే వారు కూడా ఇదే ప్రవర్తనతో మాట్లాడడం చూసిన ప్రజలు సిగ్గుతో తల దించుకుంటున్నారు.

ఇటువంటి నాయకులను ప్రోత్సహిస్తున్న పార్టీకేనా మనం ఓటు వేసింది? అనే భావనలోకి వెళ్తున్నారు మహిళలు. పర స్త్రీని ఆసించినందుకే ‘పది తలల రావణుడు’ నేలకొరిగాడు. ఒక స్త్రీ యొక్క ‘ఆత్మ గౌరవాన్ని’ కించపరిచి, నిండు సభలో ఆమెపై ‘మానసిక అత్యచారం’ చేసినందుకే ‘వందమంది ఉన్న కౌరవ సేన’ అంతరించిపోయింది. అది పురాణాలలో మనం నేర్చుకున స్త్రీ శక్తి.

స్త్రీ యొక్క ‘ఆత్మగౌరవం’ మీద దెబ్బకొట్టాలని చూసిన ప్రతి వారికి చరిత్ర ఒక గుణపాఠాన్ని అందిస్తూనే ఉంది. ‘బూతులే తప్ప పురాణాలు’ తెలియని వైసీపీ నాయకులకు ఈ మాటలు “చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే” ఉంటాయంటున్నారు రాష్ట్ర మహిళలు.

టీవీ డిబేట్ లో పాల్గొన్న టిడిపి మహిళానేత గ్రీష్మా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వైసీపీ అధికార ప్రతినిధిగా వచ్చిన మూర్తి ఆమెపై మాటలతో దాడి చేయడంతో, చర్చలో ఉన్న ఇతర పార్టీ సభ్యులే నివ్వెరపోయేలా చేసాయి ఈ వ్యాఖ్యలు. లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుంది అనే కనీస స్పృహ కూడా లేకుండా అంతమంది చూస్తుండగా గ్రీష్మ అనే టీడీపీ మహిళా నేతను…

“నువ్వు ఏపీలోనే ఉంటున్నావా? నువ్వేమైనా రేప్ కి గురయ్యావా? లేక లీ మీద ఎవరైనా రేప్ అటెంప్ట్ చేశారా? మీకు చిప్ దొబ్బింది” అంటూ వినడానికి జుగుప్స కలిగేలా వ్యాఖ్యానించిన తీరు జగన్ ప్రభుత్వంపై మహిళలో వ్యతిరేకతను పెంచుతుంది. తన తల్లిని దూషించారంటూ, చేయని విమర్శని చేసారంటూ అప్పట్లో జగన్ చేసిన హడావుడిని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

మీ ఇంట్లో ఉండే మహిళలకే ఆత్మాభిమానాలు ఉంటాయా జగన్ గారు? అంటూ నిలదీస్తున్నారు బాధించబడిన గ్రీష్మ కుటుంబ సభ్యులు. ‘మహిళా సాధికారతే మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం’ అని ప్రవచనాలు చెప్పే ముఖ్యమంత్రి జగన్ గారు ఇప్పుడు మీ పార్టీ నాయకులు చెప్పే “బూతు ప్రవచనాలు” సమాధానం చెప్పాలంటూ మహిళా లోకం నిలదీస్తుంది.

అయినా వైసీపీ నేతలకు ఇదేం కొత్త కాదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సతీమణి ‘నారా భువనేశ్వరి’ గారికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే యావత్ రాష్ట్ర ప్రజలందరి సాక్షిగా జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తున్నారు టీడీపీ మహిళా నేతలు.

రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏముందని వారిపై ఎటువంటి విమర్శ చేయడానికైనా మాకు పేటెంట్ రైట్స్ ఉంటాయని వైసీపీ ‘అనధికార ప్రతినిధి’ పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ ను., అతని కుటుంబాన్ని విమర్శిస్తూ చెప్పిన డైలాగ్స్ ను కూడా ఇపుడు గుర్తు చేస్తున్నారు జనసేన వీరమహిళలు.

రాజకీయాలలోకి వస్తే వచ్చిన వాడినే కాదు వారి ఇంట్లో మహిళలను రోడ్డు మీదకు లాగే చరిత్ర వైసీపీ నాయకుల సొంతం. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ సైతం, ‘పవన్ మూడో., నాలుగో పెళ్లిళ్లు’ అంటూ మాట్లాడి వారి కుటుంబ సభ్యులను రోడ్డెక్కించారు. “యదా రాజా తదా ప్రజా” అన్న చందంగానే ఉంది వైసీపీ నేతల ప్రవర్తన.

అదే పంధాలో పోసాని పవన్ తల్లిని., భార్యను., చివరికి పిల్లను వదిలి పెట్టకుండా మీడియా ప్రతినిధులే తిరగబడే అంతలా సమాజమే తలదించుకునేలా మాట్లాడిన ఉదంతాన్ని జనసేన వీరమహిళలు ప్రజల ముందుంచారు. మరి షర్మిల గారు ఇప్పుడు రాజకీయాలలోనే ఉన్నారు కదా? ఆమెను వ్యక్తిగత అహననం చేయొచ్చా.., అన్న ప్రశ్నలు కోకొల్లలు.

మహిళా అధికారులపై వైసీపీ మాటల దాష్టికాలకు నిదర్శనాలు ఎన్నో అంటూ టీడీపీ మహిళా నేతలు ఆ ఉదంతాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలిచ్చిన ఇక్క ఛాన్స్ ఫలితమే 151 మంది ఎమ్మెల్యేలతో జగన్ కౌరవ సభ నడుపుతున్నారని., రాష్ట్రంలో కూడా కౌరవ పాలనే కొనసాగుతుందని ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు తన ఆవేదనను వెలిబుచ్చారు.

“పధకాలిస్తున్నాం కదా అని పలుచన” చేస్తే ఊరుకునేది లేదంటూ మహిళా లోకం గొంతెత్తింది. వైసీపీ నేతల ఈ దుశ్చర్యలకు ‘దశ – దిశా’ లేని ‘దిశా చట్టాలు’ కాదు., చరిత్రలో నిలిచిపోయేలా సంచలనమైన చట్టాలు తేవాలంటూ రాష్ట్రా మహిళా నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.