telangana-secretariatమూఢాలు పోయి, మంచి రోజులు రాగానే ప్రస్తుతమున్న తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చివేసి, కొత్త భవంతిని అక్కడే నిర్మించే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. ఏడాది లోగా పనులు పూర్తి కావాలన్న లక్ష్యాన్ని విధించిన సిఎం, తన కార్యాలయంతో పాటు, సాధారణ పరిపాలన విభాగం కోసం ఓ అద్దె భవనాన్ని పరిశీలించాలని కోరినట్టు సమాచారం.

ఇక హెచ్ఓడీ కార్యాలయాల్లో మంత్రులు, ఇతర అధికారులకు సర్దుబాటు చేయాలన్నది అధికారుల భావన. సీఎం సూచనల మేరకు, ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు ఎంసీహెచ్ఆర్డీ, బూర్గల భవన్, ఎక్స్ పోటెల్ హోటల్ లను ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చేందుకు యోచిస్తున్నారు. వీటిని స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు చీఫ్ సెక్రెటరీ నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలిసింది. ఆగస్టులో ఓ మంచి ముహూర్తం కుదరగానే కొత్త సచివాలయ భవనానికి శంకుస్థాపన జరగవచ్చని అధికారులు వ్యాఖ్యానించారు.