great-applause-to-kcr-in-social-mediaఉద్యమ సమయం నుండి ఈరోజు దాకా కేసీఆర్ కు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అది ఆయన వాగ్దాటి. చెప్పే పాయింట్ ఏదైనా సూటిగా, స్పష్టంగా, ఎదుటి వాడిని మాట్లాడనివ్వకుండా చెప్పడం కేసీఆర్ లక్షణం. ఎప్పుడైనా ఒక సారి ఆయన తప్పు చేస్తున్నా దానిని కూడా ఆయన అంతే గట్టిగా చెప్పగలరు.

అలాంటి కేసీఆర్ కరోనా రక్కసి యుద్ధంలో ఎంతో బాగా పని చేస్తున్నారు. ఈ విపత్తుని ఎదురుకోవడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ వలస కార్మికుల గురించి అద్భుతంగా చెప్పారు. వలస కార్మికుల తెలంగాణ అభివృద్ధి ఏజెంట్స్ అని వారు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని చెప్పుకొచ్చారు.

తెలుగుతో పాటు హిందీలో కూడా అదే విషయం చెప్పారు. ఇప్పుడు ఆ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు వారితో పాటు దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు ప్రతిష్టలు మారు మోగుతున్నాయి. కొందరైతే ఏకంగా కేసీఆర్ ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి కాండిడేట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నారు.

తెలుగు వారి కంటే నార్త్ వారు కేసీఆర్ ని ఎక్కువగా పొగడటం గమనార్హం. ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. అప్పటికంటే ఇప్పుడు కేసీఆర్ ఇమేజ్ బెటర్ గా ఉందని అంటే మాత్రం అతిశయోక్తి కాదు.

https://twitter.com/bababanaras/status/1244541685842898944