graphic company NYVFX Wala announced they didn't worked for Adipurushపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూసిన సినీ పండితులు, విమర్శకులు, ప్రభాస్ అభిమానులు పెదవి విరిచారు. ముఖ్యంగా ఆదిపురుష్ టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్ అయితే చాలా నాసిరకంగా ఉన్నాయని, టి.వి.ఛానల్ కార్టూన్స్ లో ఉండే గ్రాఫిక్స్ ఈ సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ కంటే చాలా ఉత్తమం అని అందరూ అనుకుంటున్నారు. గ్రాఫిక్స్ చేసిన వాళ్ళు కనపడితే ప్రభాస్ ఫాన్స్ చెట్టుకి కట్టి కొట్టేసేలా ఉన్నారు.

దొంగెవరంటే.. భుజాలు తడుముకున్నట్లు! ఆదిపురుష్ కి పని చేసింది మేము కాదు అంటూ ‘ఎన్.వై.వి.ఎఫ్.ఎక్స్ వాలా’ అనే గ్రాఫిక్ సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ స్టూడియో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కి చెందినది. అయితే దీని వెనుక ఎంత నిజం ఉందొ అని ప్రభాస్ ఫాన్స్ తవ్వడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఈ ఎన్.వై.వి.ఎఫ్.ఎక్స్ వాలా ని నడిపే ప్రసాద్ సుతార్ ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరని పోస్టర్లు చూసి తెలుసుకున్నారు. మరింత లోతుకెళ్లి ప్రసాద్ సుతార్ ట్విట్టర్ పేజీ చెక్ చేస్తే, ఆశ్చర్యకరంగా ఆ పేజీ లో ఉన్న కవర్ ఫోటో ఆదిపురుష్ టైటిల్ లోగోనే .

ప్రసాద్ సుతార్ కూడా తన ట్విట్టర్ లో అయోధ్యకు బయలుదేరుతున్నట్లు నిన్న ఫోటో తో ట్వీట్ చెయ్యడం చూస్తే, ప్రభాస్ ఫాన్స్ కి ఏమనాలో అర్ధం కాక తల పట్టుకు కూర్చున్నారు. అయిదు వందల కోట్ల తో ఇలాంటి చీప్ గ్రాఫిక్స్ చేస్తారా అంటూ కొంతమంది అప్పుడే ప్రసాద్ సుతార్ కి మెసేజ్ లు పంపుతున్నట్లు సమాచారం. అందుకే ముందు జాగ్రత్తగా ఆదిపురుష్ సినిమాకి మాకు సంబంధం లేదని ఎన్.వై.వి.ఎఫ్.ఎక్స్ వాలా సంస్థ ప్రకటించేశారు.

అయినా దర్శకుడు, కళా దర్శకుడు ఇటువంటి గ్రాఫిక్స్ చేస్తున్నపుడు పక్కనుండి ఎం చేస్తున్నారు? సరి చూసుకోవాలి కదా! ప్రభాస్ లాంటి స్టార్ సినిమాకి గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా కంగారుపడి, దర్శకుడు ఓం రౌత్ టీజర్ రిలీజ్ చెయ్యడం పెద్ద తప్పు. ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు, నాణ్యత తో కూడిన సినిమా కావాలనుకున్నప్పుడు ఎక్కువ సమయమే పడుతుంది. సమయం ఎక్కువైనా పరవాలేదనుకుని తీస్తే బాహుబలి లాంటి కళాకాండం వస్తుంది, కంగారుపడి ఏది పడితే అది తీస్తే ఆదిపురుష్ లాంటివి వస్తాయి. కాదంటారా ?