Governments with compensations పరిశ్రమలకు ప్రోత్సహకాలు కల్పించడం ప్రభుత్వానికి కాదనలేని విధి. పరిశ్రమలు స్థాపించేటప్పుడు కంపెనీలకు నిర్దేశిత మార్గదర్శకాలను సూచించి.,ఆ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పరిశ్రమలు తమ మనుగడ సాగించేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత.

ఒక పరిశ్రమను స్థాపించేటప్పుడు అక్కడ స్తానిక ప్రజల అభిప్రాయం సేకరణ తప్పనిసరి అనేది అటు ప్రభుత్వాలు, ఇటు పరిశ్రమ వర్గాలు గుర్తుంచుకోవాల్సిన నైతిక బాధ్యత. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని తుంగలో తొక్కి నివాస స్థలాల మధ్యనే అత్యంత ప్రమాదకరమైన రసాయనిక కంపెనీలకు అనుమతులిస్తున్న ప్రభుత్వాలు, కార్పోరేట్ కంపనీల పెరవీలతో సావాసం చేస్తూ ప్రజల భద్రతను “అగ్ని”కి వదిలేయడం దారుణం అంటున్నారు స్థానికులు.

ప్రమాదాలనుండి బయట పడటానికి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా పరిశ్రమ యాజామాన్యాలు, కార్మికుల ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసిన ఉదంతాలు కళ్ళముందు సజీవ సాక్ష్యాలుగా కదులుతున్నాయి.నాటి దివీస్ ఘటన మొదలుకొని నేటి విశాఖ ఎల్జీ పాలిమర్స్.., అక్కిరెడ్డిగూడెం ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వరకు ఈ పాపాలకు బాధ్యులెవరు? శిక్షలు అనుభవిస్తుందెవరు? న్యాయం కోరుతోందెవరిని ?

పొట్టకూటి కోసం తమ ప్రాణాలను,తమ కుటుంబాల భవిషత్ ని అగ్నికి పణంగా పెట్టిన కార్మికుల వ్యధలు మరెన్ని చూడాలి అంటూ నిలదీస్తున్నారు భాదిత కుటుంబాలు. ప్రమాదం జరిగిన తరువాత మేల్కొనే ప్రభుత్వాలు,వారి నిర్లక్ష్యపు పొరపాట్లకు చేసే దిద్దుబాటు చర్యలే ఈ పరిహారాలు అంటూ తమ వేదనను వ్యక్తం చేస్తున్నారు భాదిత కుటుంబాలు.

ప్రమాదం జరిగిన తరువాత ఇచ్చే నష్ట పరిహారాలతో ఆ కార్మికుల కుటుంబాలలో వెలుగుని నింపలేమని ప్రభుత్వాలు తెలుసుకునే రోజుకోసం ఎదుచూడటం తప్ప మరేం చేయలేని నిస్సహాయ స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు ఈ పరిశ్రమలలో పని చేసే కార్మికులు. కార్మిక చట్టాలు బలంగా పనిచేసే రోజులు రావాలని ఆశిస్తున్నారు.

పరిశ్రమల నిర్లక్ష్యానికి…,ప్రభుత్వాల పరిహారాలు ఇంకెన్నాళ్లు..? అంటూ రోడెక్కుతున్నారు మానవతావాదులు.ఆ నిర్లక్ష్యపు దారుణాలకు యాజమాన్యాన్ని భాద్యులు చేసే చట్టాలు తేవాలి.,ఆ చట్టాలకు లోబడి యాజమాన్యం కార్మిక కుటుంబాలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలే కాని వారి పొరపాట్లకు బాధ్యులుగా మిగలకూడదని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు.

నిర్లక్ష్యం వహిస్తుంది పరిశ్రమలు., నొప్పిని అనుభవిస్తుంది కార్మికులు..,న్యాయం కోరేది ప్రభుత్వాన్ని, ఈ తీరు మారాలి. తప్పు చేసిన వాడే న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలి. అప్పుడే వారికి భయం.., భాద్యత రెండు వస్తాయి. అలా కాకుండా కంపనీల పైరవీలతో ప్రభుత్వాలు తృప్తి చెంది., ప్రజలను తృప్తి పరచడానికి పరిశ్రమల నిర్లక్ష్యపు పాపాలను తమ భూజాల మీద కాపు కాసినంత కాలం ఇటువంటి ప్రమాదాలకు ప్రభుత్వం బాధ్యత వహిచాల్సిందే.