నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయకు ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం యొక్క కర్టెన్-రైజర్ వీడియోను మేకర్స్ గత వారం విడుదల చేశారు, ఇది ప్రేక్షకులను తక్షణమే ఆకట్టుకుంది. ఇప్పుడు, సినిమా కథ గురించి ఒక రూమర్ ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది.
నాని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడట కాని అతను ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమిస్తాడు. అతను ఆమెను బ్రాహ్మణ యువతిగా ట్రైనింగ్ ఇచ్చి తన ఇంటికి తీసుకువస్తాడు. మిగిలినవి ఆ ఇంట్లో ఆ జంట పడే పాట్లు. ఈ ప్రకారం ఈ సినిమా అల్లరి నరేశ్ సీమశాస్త్రిని పోలి ఉండే అవకాశం ఉన్నట్టు ఉంది.
Also Read – త్యాగాలకు న్యాయం కావాలి…పొత్తుకు న్యాయం చెయ్యాలి..!
ఓ ఫ్యాక్షనిస్ట్ అమ్మాయిని బ్రాహ్మణ అబ్బాయి ప్రేమిస్తాడు. కులాలు వేరు కావడంతో ఒప్పుకోరని తెలిసి, తన కుటుంబంతో సహా అక్కడకు వెళ్లి ఆ యువకుడు ఫ్యాక్షనిస్ట్‌గా కలరింగ్ ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కథాంశం. అంటే సుందరానికి కాన్సెప్ట్ కూడా అలానే ఉంది. అయితే ట్రీట్మెంట్, నాని స్టైల్ తో ఫ్రెష్ గా అనిపించేలా సినిమా తీయాలి.
షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది మరియు ఈ చిత్రం 2021 లో విడుదల అవుతుంది. రాజా రాణి అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నజ్రియా ఫహద్ ఈ చిత్రంలో నానిని రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రంతో ఆమె తన తెలుగు అరంగేట్రం చెయ్యనుంది.
Also Read – కేసులతో చంద్రబాబు నాయుడిని దెబ్బతీయబోతే….
వివేక్ ఆత్రేయ మునుపటి చిత్రాలకు ఇంప్రెసిప్ మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికీ స్వరాలు కూరుస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.