Gorilla-First-Look-Teaserకొన్ని కొన్ని పోస్టర్లను అలా చూడగానే ఇలా చిరుదరహాసం ప్రదర్శితం కావడం తెలియకుండానే జరిగిపోతుంది. అలాంటి పోస్టర్లలో ఒకటిగా ఈ “గొరిల్లా” పోస్టర్ నిలుస్తోంది. జీవా ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న ఈ ఫన్నీ మూవీ ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను అతి త్వరలో పలకరించబోతోందని స్పష్టం చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో మూడు కీలక పాత్రలు ‘నన్’లు వేసుకునే డ్రస్సులలో కామెడీగా కనిపించగా, క్రింద కళ్ళజోడు పెట్టుకున్న గొరిల్లా పోస్టర్ ను మరింత స్పెషల్ గా మార్చేసింది. హీరోయిన్ గా ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలిని షిండే నటిస్తుండగా, మరో కీలకపాత్రను కమెడియన్ సతీష్ పోషిస్తున్నారు. ఈ సినిమాను ఫన్నీగా తెరకెక్కించే దర్శకత్వ బాధ్యతలను డాన్ శాండీ నిర్వహిస్తున్నారు.