gorantla madhav warning to raghu ramakrishnam rajuప్రజలకు మేలు చేసే చట్టాలు చేసే దేవాలయం పార్లమెంట్. అలాంటి పార్లమెంట్లో ఒక ఎంపీ ఇంకో ఎంపీని అంతం చేస్తాం అంటూ బెదిరించడం శోచనీయం. పైగా ఆ బెదిరింపు చేసిన ఎంపీ గతంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి పని చేసిన పోలీసు అధికారి.

వివరాల్లోకి వెళ్తే… నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు గత కొంత కాలంగా అధికార పక్షానికి ఏకు మేకై ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు తారసపడ్డారట.

జగన్ కు వ్యతిరేకంగా పెడుతున్న ప్రెస్ మీట్లు మానకపోతే అంతం చేస్తాం అంటూ ఆర్ఆర్ఆర్ ని బెదిరించారట. ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ కృష్ణ రాజు కంప్లయింట్ చేశారు. మాధవ్ మీద యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారట.

అలాగే తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ ఘటన జరిగిందట. ఈ ఘటనకు తన పక్కన ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు సాక్ష్యం చెబుతారని ఆర్ఆర్ఆర్ లేఖలో పేర్కొన్నారు. అలాగే సిసిటీవీ ఫ్యూటేజ్ కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆర్ఆర్ఆర్ స్పీకర్ ని కోరారు.

రాష్ట్రంలో నేతల మాటల తూటాలకు, దుర్భాషలకు అడ్డూ అదుపూ ఎలానూ ఉండదు. కనీసం పార్లమెంట్ లోనైన కాస్త హుందాగా ప్రవర్తిస్తే మేలు. అని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.