Gorantla Madhav vulghar video call Issue    హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంలో జగన్ ప్రభుత్వ వైఖరి మెల్లమెల్లగా స్పష్టమవుతోంది. సిగ్గుమాలిన ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి దర్యాప్తు, నివేదిక పేరుతో అతనిని జగన్ ప్రభుత్వం వెనకేసుకు వస్తూనే ఉంది. ఎప్పటిలాగే ఆ కేసులో నిందితుడిపై చర్యలు తీసుకొనే ప్రయత్నం చేయకుండా ప్రతిపక్షాలను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంతో సంబందం ఉన్నట్లు భావిస్తున్న మహిళ అనంతపురంలోని గాండ్లపెంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావలసి ఉంది. ఒకవేళ వారి నివేదికలో మా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అసలైనదే అని తేలితే తప్పకుండా ఆయనపై చర్యలు తీసుకొంటాము. కానీ ఇదేదో చాలా పెద్ద వ్యవహారమన్నట్లు టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. నిజానికి ఓటుకు నోటు కేసు దీని కంటే చాలా పెద్దది. దానిలో డబ్బు, వీడియో ఇతర సాక్ష్యాధారాలు లభించినప్పటికీ ఆ ఆడియో సంభాషణలో అది చంద్రబాబు నాయుడు గొంతో కాదో నేటి వరకు తేలలేదు,” అని అన్నారు.

సజ్జల మాటలను బట్టి జగన్ ప్రభుత్వం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసును ఎటూ తేలకుండా నాన్చి ఈ వేడి తగ్గి మరో అంశం తెరపైకి వచ్చినప్పుడు మెల్లగా అటకెక్కించేయాలని అనుకొంటోదేమో?అయితే ఇటువంటి ఎంపీ పక్కన శాసనసభలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు కూర్చోనే సాహసం చేయగలరా?ఆయనతో ఇదివరకులా మాట్లాడగలరా?అని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే తప్పకుండా చర్యలు తీసుకొని ఉండేది.