Gopichandh chanakya copied from bollywood movieగోపిచంద్ హీరోగా రూపొందుతోన్న తాజా యాక్షన్ చిత్రానికి “చాణ‌క్య” అనే పేరుని ఖ‌రారు చేశారు. నిన్న సినిమా టైటిల్ కు సంబందించిన లోగో విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ హీరోగా రూపొందుతోన్న మూవీ ఇది. అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. చాలా భాగాన్ని నార్త్ ఇండియాలో తీశారు.

ఎఫ్ 2 తో భారీ విజయాన్ని అందుకున్న మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీని సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ స్పై గా కనిపిస్తారని, సినిమాలో ఆయన క్యార‌క్ట‌రైజేష‌న్‌కి, ఈ సినిమా టైటిల్‌కి లింక్ ఉందని భోగోట్టా. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ లో బ్లాక్ బస్టరైన ఏక్ తా టైగర్ సినిమా ను కాపీ కొట్టి ఫ్రీ మేక్ చేస్తున్నారని ఫిలింనగర్ లో వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ట్రైలర్ విడుదల అయ్యేవరకూ ఇందులో నిజానిజాలు తెలిసే అవకాశాలు లేవు.

మెహ‌రీన్ తో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జ‌రీనా ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. 2014 లో లౌక్యం తరువాహ గోపీచంద్ కు ఒక్క హిట్ కూడా లేదు. ఆ తరువాత వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చారు గోపీచంద్. ఇప్పుడు ఏకంగా ఆయన మార్కెట్ జీరో అయ్యే పరిస్థితి ఉంది. ఈ సినిమాతోనైనా ఆయన హిట్ సాధిస్తారేమో చూడాలి.