Gopichand - Tamanna Bhatia - Movieమ్యాచో హీరో గోపీచంద్ తదుపరి చిత్రం చాణక్య రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే గోపీచంద్ మరో సినిమా పట్టాలెక్కిచ్చాడు. సంపత్‌ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. నవంబర్‌ నుండి షూటింగ్‌ స్టార్ట్‌ ఏప్రిల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.

ఫస్ట్‌టైమ్‌ గోపీచంద్ ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా చేస్తున్నాడు . దానికోసం దర్శకుడు చాలా రీసెర్చ్‌ చేశాడట. గోపీచంద్ ఈ సినిమాలో ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నారు. తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. దీనికోసం తమన్నా కబడ్డీ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట.

25 మంది బ్యూటిఫుల్‌ ప్లేయర్స్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారని సమాచారం.సమంతతో ‘యు టర్న్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ దాదాపుగా ముగింపుకు చేరుకున్నాయి.

2014 లో లౌక్యం తరువాత గోపీచంద్ కు ఒక్క హిట్ కూడా లేదు. ఆ తరువాత వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చారు గోపీచంద్. ఇప్పుడు ఏకంగా ఆయన మార్కెట్ జీరో అయ్యే పరిస్థితి ఉంది. మరి గోపి రేపు విడుదలయ్యే చాణక్యతో హిట్ కొడతాడో లేక ఈ సినిమా వరకూ ఆగాలో చూడాల్సి ఉంది.