Gopichand Soukhyam tradeఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా హీరో హీరోయిన్లుగా నటించిన “సౌఖ్యం” చిత్రం ఆడియో వేడుకను ఆదివారం సాయంత్రం ఒంగోలులో నిర్వహించారు. సాధారణంగా ఆడియో వేడుకలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంటాయి. కానీ దానికి భిన్నంగా ‘సౌఖ్యం’ ఆడియోను ఒంగోలులో ఎందుకు విడుదల చేసారో గోపీచంద్ అభిమానులు స్పష్టం చేసారు.

“సౌఖ్యం” ఆడియో విడుదల సందర్భంగా తరలి వచ్చిన ప్రేక్షక లోకాన్ని చూసి చిత్ర యూనిట్ పట్టరానంత సంతోషంలో మునిగి తేలింది. ఓ అగ్ర హీరోను చూడడానికి విచ్చేసిన అభిమానుల మాదిరి గోపీచంద్ సినిమాకు రావడం చూసి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అవాక్కయ్యారట. హీరోగా గోపీచంద్ కు ఇంత రేంజ్ ఉందా? అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసేలా ఒంగోలు వాసులు ‘సౌఖ్యం’ సినిమా ఆడియో వేడుకకు హాజరయ్యారు.

ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ కావడం మరియు అనూప్ అందించిన స్వరాలు కూడా వినసొంపుగా ఉన్నాయనే టాక్ ను సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంలో ఉందట. వీటికి తోడు పక్కా కమర్షియల్ యాంగిల్ లో ఉన్న ధియేటిరికల్ ట్రైలర్ కూడా అన్ని వర్గాలకు చేరువ కావడంతో, ఇక సినిమా విడుదల కాబోయే 25వ తేదీ వైపుకు చిత్ర యూనిట్ చూపులు మళ్లాయి. ‘సౌఖ్యం’ ద్వారా మరో సక్సెస్ తమ హీరో ఖాతాలో పడటం ఖాయమని గోపీచంద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న అభిప్రాయాలు.