Gopichand Malineni - Balakrishnaనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రాల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. మొన్న ఆ మధ్య ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నారని, మైత్రి మూవీ మేకర్స్ దానిని నిర్మిస్తారని వార్తలు వచ్చాయి.

అయితే గోపీచంద్ మాక్సిమమ్ యావరేజ్ డైరెక్టర్… ఇప్పటివరకు అతను తీసిన సినిమాలన్నీ అటువంటివే. అటువంటి దర్శకుడితో సినిమా ఎందుకు అని అభిమానులు అప్పట్లో పెదవి విరిచారు. అయితే నిన్న విడుదలైన రవి తేజ, గోపీచంద్ కాంబినేషన్ సినిమా క్రాక్ తో వారి అభిప్రాయం మొత్తం మారిపోయింది.

హీరోయిజం ఎలివేషన్, కొన్ని ఫైట్లు చూసి మాస్ ఆడియన్స్ మతి పోయింది. థియేటర్లలో వారికి పూనకాలు వచ్చేశాయంటే అతిశయోక్తి కాదు. సంక్రాంతి మిగతా సినిమాలు విడుదల కాకముందే క్రాక్ సంక్రాంతి విన్నర్ అనేస్తున్నారు అంతా. దానితో గోపీచంద్ మీద బాలయ్య అభిమానుల ఒపీనియన్ ఒక్కసారిగా మారిపోయింది.

ఈ కాంబినేషన్ పడాలి అంటూ వారు ఇప్పుడు దేవుడికి దండాలు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కాంబినేషన్ మీద అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ కంఫర్మ్ అయ్యి క్రాక్ రేంజ్ సినిమా పడితే బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీరుతుంది. బోయపాటి సినిమా, ఆ తరువాత అటువంటి సినిమా పడితే ఇక మాస్ ప్రేక్షకులకు పండగే.