Gopichand Chanakya copies from Salman khan Ek Tha Tigerగోపిచంద్ హీరోగా రూపొందుతోన్న తాజా యాక్షన్ చిత్రానికి “చాణ‌క్య” ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు హీరో జన్మదినం సందర్భంగా విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ హీరోగా రూపొందుతోన్న మూవీ ఇది. అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ లో బ్లాక్ బస్టరైన ఏక్ తా టైగర్ సినిమా ను కాపీ కొట్టి ఫ్రీ మేక్ చేస్తున్నారని ఫిలింనగర్ లో వదంతులు వినిపించాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ వచ్చాకా ఆ అనుమానాలు బలపడ్డాయి.

పోస్టర్ బ్యాక్ డ్రాప్ లోని ముస్లిం ప్రదేశం టెర్రరిస్టు బ్యాక్ గ్రౌండ్ ను సూచిస్తున్నాయి. ఏక్ తా టైగర్ లో సల్మాన్ ఖాన్ కూడా ఒక మిషన్ మీద ఆఫ్ఘానిస్తాన్ వెళ్తాడు. ఆ చిత్రంలో సల్మాన్ తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ లాంటిది ఉంటుంది ఈ పోస్టర్ లో గోపీచంద్ కూడా అలానే ఉన్నారు. దీని బట్టి సినిమా ఫ్రీ మేక్ అనే వదంతులు నిజామా అనిపించక మానదు. లేకపోతే సినిమా రీమేక్ రైట్స్ కొని ఆ విషయం దాస్తున్నారా అని కూడా అనిపించవచ్చు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. చాలా భాగాన్ని నార్త్ ఇండియాలో తీశారు. ఎఫ్ 2 తో భారీ విజయాన్ని అందుకున్న మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీని సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. మెహ‌రీన్ తో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జ‌రీనా ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 2014 లో లౌక్యం తరువాత గోపీచంద్ కు ఒక్క హిట్ కూడా లేదు. ఆ తరువాత వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చారు గోపీచంద్. ఇప్పుడు ఏకంగా ఆయన మార్కెట్ జీరో అయ్యే పరిస్థితి ఉంది. ఈ సినిమాతోనైనా ఆయన హిట్ సాధిస్తారేమో చూడాలి.