gopi-chand-takes-tamanna-name-instead-catherine-tresaసంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన “గౌతమ్ నంద” సినిమా ఆడియో విడుదలైంది. థమన్ స్వరపరిచిన ఈ ఆడియో వేడుకలో హీరో గోపిచంద్ మాట్లాడుతూ… చాలాకాలం తర్వాత పూర్తి సంతృప్తిని ఇచ్చిన సినిమాగా పేర్కొన్నారు. దర్శకుడు సంపత్ తనకు ఏదైతే కధ చెప్పారో, దానిని ఆన్ స్క్రీన్ పైకి వందకు వంద శాతం తీసుకువచ్చారని, భవిష్యత్తులో తాను ఎలా ఉన్నా, ఏ సమయంలోనైనా సంపత్ తో సినిమా చేయడానికి సిద్ధమని చెప్పారు.

‘గుండెల మీద చేయి వేసుకుని చెప్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని తృప్తి పరుస్తుంది, అది ఎంత రేంజ్ కు వెళ్తుందనేది చెప్పలేను గానీ, ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న విశ్వాసాన్ని’ గోపీచంద్ వ్యక్తపరిచాడు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా కీలకమని, దానిని అత్యద్భుతంగా థమన్ అందించారని, ఈ కధ నచ్చడంతో చాలా ఇష్టపడి మరీ థమన్ చేసాడని, అలాగే సినిమాలో ఉన్న నాలుగు పాటల్ని కూడా బాగా ఇచ్చారని, థమన్ పై ప్రశంసలు కురిపించారు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే… తమన్నా, హన్సికలు చాలా బాగా చేసారని, వాళ్ళతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందని చెప్పిన గోపీచంద్ కు బ్యాక్ గ్రౌండ్ లో… ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా కాదు, కేథరిన్ అంటూ హింట్ ఇచ్చారు. దీంతో తాను నోరు జారిన విషయం తెలుసుకున్న గోపిచంద్, ‘సారీ’ చెప్తూ… హన్సిక, కేథరిన్ లతో మొదటిసారి చేస్తున్నానని సవరించుకున్నాడు. హీరోయిన్ల పేరును గోపీచంద్ మార్చి చెప్పడంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ అంతా నవ్వుకుంది.