google maps on mobiles without internetఇంటర్నెట్‌, సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ మరో ముందు అడుగు వేసింది. ఇప్పటి వరకు మొబైల్‌ లేదా కంప్యూటర్‌లో నెట్‌ ఉంటేనే గూగుల్‌ మ్యాప్స్‌ వచ్చేవి. కాని తాజాగా గూగుల్‌ ఒక యాప్‌ను రూపొందించింది. దాని వల్ల మొబైల్‌లో నెట్‌ లేక పోయినా కూడా న్యావిగేషన్‌ చేసే వీలు కలుగుతుంది. ఏరియాల వారిగా కొన్ని యాప్స్‌ను గూగుల్‌ వారు రూపొందించారు. ఏ ఏరియాకు ఆ ఏరియా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి పోతుంది.

గూగుల్‌ రూపొందించిన ఈ కొత్త యాప్‌ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ముఖ్యంగా ఇంటర్‌నెట్‌ లేకుండానే న్యావిగేషన్‌ విధానం ఉండటం వల్ల స్మార్ట్‌ ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరు దీన్ని వాడేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌ వర్షన్‌ మాత్రమే ఉంది. త్వరలోనే యాపిల్‌ మరియు ఇతర ఆపరేటింగ్‌ సిస్టంలకు కూడా అందుబాటులోకి తీసుకు వస్తాం అని గూగుల్‌ ప్రకటించింది. గూగుల్‌ తీసుకు వచ్చిన ఈ కొత్త యాప్‌కు సాధారణ జనాలు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. గూగుల్‌ భవిష్యత్తులో మరెన్ని అద్బుతాలను సృష్టిస్తుందో చూడాలి.