google company in hyderabadఇంటర్నెట్ దిగ్గజం ‘గూగుల్’ సంస్థ ఇండియాపై వరాల జల్లు కురిపించింది. సదరు సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఢిల్లీలో జరిగిన ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న సొంత బిల్డింగ్ సంస్థ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

హైదరాబాద్ లో అన్ని సకల హంగులతో ‘గూగుల్’ కంపెనీ స్థాపించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న నాలుగు కార్యాలయాలు (హైదరాబాద్, బెంగళూరు, గూర్గావ్, ముంబయిల్లో) లీజ్ కు తీసుకున్నదేనని, అయితే హైదరాబాద్ లో నిర్మించనున్న ఆఫీస్ అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు కానుందని.., దీనికి సంబంధించిన అవగాహనా ఒప్పందాలపై తెలంగాణా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ – గూగుల్ గ్లోబల్ హెడ్ రెడ్ క్లిఫ్ లు 2016 మే నెలలో కాలిఫోర్నియాలో ఉండే గూగుల్ హెడ్ క్వార్టర్స్ మౌంటెన్ వ్యూలో కలిసి సంతకాలు చేస్తారని, ఈ భవనాన్ని నిర్మించడానికి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేయనున్నామని, దీని వలన మరో 6 వేలకు మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సుందర్ పిచాయ్ తెలిపారు.

గచ్చిబౌలిలో గూగుల్ సంస్థ నెలకొల్పబోతున్న ఈ కార్యాలయం కోసం తెలంగాణ ప్రభుత్వం 7.2 ఎకరాల స్థలాన్ని కేటాయించనట్టు సమాచారం. అలాగే 2016 లో ప్లానింగ్ చేసి సమ్మర్ లో నిర్మాణపు పనులు మొదలుపెట్టి 2019 కల్లా కార్యాలయాన్ని రెడీ చేసే విధంగా గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.