Goodachari-4K--Teaser (2)తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతోన్న లీకేజ్ పర్వంతో ఏది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోన్న “గూఢచారి” సినిమాలోని ఓ సన్నివేశాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూ ట్యూబ్ లో అధికారికంగా విడుదల చేసింది.

అడవి శేష్ పై చిత్రీకరింపబడిన ఈ యాక్షన్ సన్నివేశం ఒక నిముషం పైగా నిడివి ఉండగా, కేవలం సింగిల్ షాట్ లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం చెప్పుకోదగ్గ విషయం. సినీ విమర్శకులు, టాలీవుడ్ అగ్ర హీరోల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది.