Goodachari premiers show talkహాలీవుడ్ స్థాయిలో తమ “గూఢచారి” సినిమాను రూపొందించామని ధియేటిరికల్ ట్రైలర్ ద్వారా అడవి శేష్ చెప్పకనే చెప్పగా, అందుకు ఏ మాత్రం తక్కువ కాదన్న విషయం ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోన్న సినిమా చెప్తోంది. ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ షో పడిన తర్వాత టాక్ అంతకు రెట్టింపుగా ఉండడం చిత్ర యూనిట్ కు ఉత్సాహాన్నిచ్చే అంశం.

చూసిన ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో సక్సెస్ అయిన చిత్ర యూనిట్, విలన్ విషయంలో మాత్రం మాంచి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆ ఆసక్తి అలాగే ఉండాలన్న కోణంలో విలన్ గా పోషించిన పేరును బయట పెట్టడం లేదు గానీ, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఒక నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా ఏమిటో అడవి శేష్ ఈ సినిమాతో నిరూపించుకున్నారు.

ఉన్నతమైన సాంకేతిక విలువలతో అగ్ర హీరోల మూవీల మాదిరి రూపొందించిన ఈ సినిమాకు ఎంపిక చేసుకున్న కాస్టింగ్ ప్రధాన ప్లస్ పాయింట్. అరుదుగా కనిపించే నటీనటులను ఎంపిక చేసుకోవడమే కాకుండా, రొటీన్ గా కనిపించే వారిని కొత్తగా చూపించి ప్రేక్షకులకు ఫ్రెష్ నెస్ ను కలిగించింది. బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సందడి చేసే చిత్రంగా ఈ “గూఢచారి” నిలుస్తుందన్న ‘ఫస్ట్ టాక్’ ముక్తకంఠంతో వెలువడుతోంది.