Goodachari-Trailer-Talk-Keeps-The-Intrigue-And-Hopes-Aliveలిమిటెడ్ బడ్జెట్ లో బ్రెత్ టేకింగ్ విజువల్స్ తో సినిమాను ఎలా తీయవచ్చో “గూడచారి” అనే ట్రైలర్ చెప్తోంది. అంతకుముందు ఫాస్ట్ పేస్ టీజర్ విడుదల చేయగా, ఈ ట్రైలర్ మాత్రం హాలీవుడ్ స్టైల్ లో ఉంది. ‘అర్జున్’గా హీరో అడవి శేష్ కనిపించగా, అసలు ఈ అర్జున్ క్యారెక్టర్ ఏంటి? అన్నది సస్పెన్స్ లో ఉంచడంలో ట్రైలర్ సక్సెస్ అయ్యింది.

సినిమా మొత్తం 168 లొకేషన్స్ లో చిత్రీకరించామని అడవి శేష్ చెప్పగా, ఆ లొకేషన్స్ వాల్యూ ఏమిటో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా కనిపించే విధంగా చిత్రీకరణ ఉంది. స్టన్నింగ్ సినిమాటోగ్రఫీని డియో అందించగా, శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘క్షణం’ సినిమా తర్వాత మరో హిట్ కొట్టేలా అడవి శేష్ ఉన్నాడని ఈ ట్రైలర్ అయితే నమ్మకాన్ని కలిగించింది.