Goodachari---Adivi-Sesh---Mahesh-Babuఅడవి శేష్ హీరోగా తెరకెక్కిన “గూడచారి” సినిమా ఈ నెల 3వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభించడంతో, ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మేనల్లుడు ఓ కీలక పాత్ర చేయడం మరో ముఖ్యమైన అంశం.

అడవి శేష్ చిన్నప్పటి పాత్రను ప్రిన్స్ బావ సుధీర్ బాబు తనయుడు దర్శన్ చేత చేయించారు. ఇప్పటికే తెలుగుతెరకు పరిచయమైన దర్శన్, వరుసగా సినిమాలలో నటిస్తుండడం విశేషం. మేనమామ మహేష్ బాబును స్పూర్తిగా తీసుకున్నారో లేక తండ్రి మాదిరే సినిమాలలో అమితమైన ఆసక్తి ఉందో గానీ, వరుసగా సినిమాలలో ఈ చిన్నోడు నటిస్తున్నాడు.