good news to yuvaraj singh fansక్రికెట్ ను ఇష్టపడే వారంతా దాదాపుగా యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ను అమితంగా ప్రేమిస్తారు. అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే యువీ షాట్లు అలా ఉంటాయి మరి. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి సరైన అవకాశాలు లభించక, వచ్చిన ఒకటి, రెండు సమయాలలో రాణించక, మళ్ళీ జట్టులో స్థానం కోల్పోతాడేమోనని ఆందోళన అభిమానుల నుండి వ్యక్తమైంది.

అయితే ఇక దానికి ఆస్కారం లేకుండా తన మునుపటి వైభవాన్ని ప్రదర్శిస్తున్నాడు యువీ. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువీ, గురువారం యూఏఈ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో రాణించి అభిమానులను అలరించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో యూఏఈ జట్టు పసికూనే అయినప్పటికీ, ఆ జట్టు మీద కూడా రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే కనీసం ఈ జట్టుతో కూడా రాణించలేకపోయాడన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యువీ (14 బంతుల్లో 25) ధాటికి 81 పరుగుల లక్ష్యం కేవలం 10.1 బంతుల్లోనే టీమిండియా చేధించి, భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే యువీ ప్రదర్శించిన ఆట తీరుతో అభిమానులే కాదు, విమర్శలే కూడా సంబర పడుతున్నారు. ముఖ్యంగా యువరాజ్ సింగ్ మునుపటి మాదిరి అద్భుతమైన షాట్లు కొడుతుండడం టీమిండియాకు బాగా లాభించే అంశం. ఇక, యువీ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఇదే రీతిన ప్రదర్శన ఇస్తే వన్డే జట్టులోనూ యువీ స్థానం ఖరారు అవుతుంది. అభిమానులంతా కూడా ఆ సమయం కోసమే వేచిచూసేది కూడా!