GOOD NEWS FOR AMARAVATHI FARMERS‘అమరావతి’ నిర్మాణానికి ఎంపిక చేసిన గ్రామాల రైతులకు 2016 జనవరి నాటికల్లా ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణ వంటి వారు పలు సందర్భాలలో చెప్పారు. అయితే కారణాలేవైనా గానీ, అవేమీ కార్యరూపం దాల్చలేదు.

తాజాగా ప్రభుత్వం నుండి మరో ప్రకటన వచ్చింది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను కల్పించే పనిలో ప్రభుత్వం ఉందని, మార్చి నాటికి ప్లాట్ల పంపిణీ ప్రారంభిస్తామని అన్నారు. అయితే ప్లాట్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే రైతులకు అందజేస్తామని పునరుద్ఘాటించారు.

29 గ్రామాల మధ్యలో రానున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణాలకు జనవరి 8న టెండర్లు ఆహ్వానిస్తామని, టెండరు తేదీ నుంచి 21 రోజుల తర్వాత సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. మంగళగిరి నుండి వెళ్ళిపోయిన తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడికి దక్షిణంగా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది.