Good appreciation for India Independence Day Flag Hoisting Photo!నడుం లోతు నీళ్లలో ఉన్న ఓ పాఠశాలలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. లక్షల్లో నెటిజన్లు సదరు ఫోటోను లైక్‌ కొట్టి షేర్‌ చేస్తూ ప్రశంసిస్తున్నారు. అసలు ఈ ఫోటో ఎక్కడిదో అన్న దానిపై ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… అసోంలోని ధుబ్రి ప్రాంతంలోని నష్కర ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగురవేశారు. జెండా వందన కార్యక్రమానికి ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారుల భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ వాళ్లు మాత్రం జెండా వందనం చేస్తూ నిలబడ్డారు.

దీని గురించి ఆ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు మిజనూర్‌ రెహమాన్‌ వివరిస్తూ, సంబంధిత ఫోటోను ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేశారు. ‘ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము.. ఈ ఫోటోనే చెబుతుంది’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, ఫోటోలతో సహా తీసి విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, జిల్లా విద్యాధికారికి పంపారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది.