godavari-boat-tragedy-sakshi-vs-jana-senaగోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 34 మృతదేహాలను వెలికి తీశారు. మరో 17 మృతదేహాల కోసం గాలింపు జరుగుతుంది. గోదావరికి వరద పోటెత్తినప్పుడు బోట్లను ఎలా అనుమతించారు అని ప్రభుత్వం మీద విమర్శలు వస్తుంటే, అధికార పార్టీ సాక్షి మీడియా ద్వారా ఆ పాపాన్ని వేరొకరి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంది.

మంత్రులు ఆ పర్మిషన్ టీడీపీ హయం లో ఇచ్చారు అని తప్పించుకునే ప్రయత్నం చెయ్యగా, తాజాగా ఆ బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణ జనసేన క్రియాశీల సభ్యుడు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. రాజమండ్రితో పాటు సొంత ప్రాంతం విశాఖలో కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడట.

పైగా ఆయన మీద గతంలోనే చాలా కేసులు ఉన్నాయని ఆ కేసులు ఏకరువు పెట్టింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామం అతని స్వగ్రామం. అతని స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అందులో కొన్ని కేసులు ఇప్పటికీ కోర్టులలో నడుస్తున్నాయట.

సాక్షి చెప్పేది నిజమే కావొచ్చు అతని రాజకీయ పార్టీకి ప్రమాదానికి ఏమి సంబంధం? కేసులు ఉన్నవాడిని దగ్గర దగ్గర నాలుగు నెలల పాటు ఎందుకు ఈ ప్రభుత్వం ఉపేక్షించినట్టు? అతను జనసేన పార్టీ వాడైనా, టీడీపీ వాడైనా ప్రయాణికుల రక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత కదా? ఇటువంటి తరుణంలో వేరొకరి మీద నెట్టేసే ప్రయత్నం ఎంతవరకు సమంజసం?