God_Father_Chiranjeevi_Directionమెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విజయం తో చాలా ఆనందంగా ఉన్నారు. ఆచార్య సినిమా విఫలమైన తరువాత ఈ గాడ్ ఫాదర్ ఆయనకు, అయన అభిమానులకు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులైనా బుకింగ్స్ చాలా బాగుండటం బయ్యర్స్ ని హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేశాయి.

ఇక ఈరోజు జరిగిన సక్సెస్ మీట్లో గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ చిరంజీవిగారు దర్శకుడి పనిలో వేలు పెడతారని అన్నవాళ్ళని తంతానన్నారు. నూట యాభై సినిమాలకు పైగా అనుభవం ఉన్న మెగాస్టార్ సినిమా సభ్యుల్లో ఎవరికైనా సలహాలివ్వొచ్చు, అయన ఏదైనా బాగాలేదంటే అది ఖచ్చితంగా నిజం అయి ఉంటుందని, మెగాస్టార్ చిరంజీవి సలహాలు పాటించడం వలనే గాడ్ ఫాదర్ ఈ రోజు ప్రేక్షకులను అలరిస్తూ విజయం వైపు దూసుకుపోతుందని అన్నారు.

మోహన్ రాజా చెప్పినది ఖచ్చితంగా నిజం అని కొందరు మెగా ఫాన్స్ అంటుంటే, కొంతమంది యాంటీ ఫాన్స్ మాత్రం ఈ వేలు పెట్టుడు కార్యక్రమం వలనే ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని అంటున్నారు. ఇది హీరోలు రాజ్యమేలే కాలం, హీరోలు ఏది చెప్తే అది చెయ్యాల్సిన రోజులివి. ఇక సినిమా జయాపజయాలకు ఒక్కర్నే బాధ్యుడ్ని చెయ్యడం సరి కాదు.

సినిమా అనేది సమిష్టి కృషి. పని చేసిన అందరూ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. ఒక్కొక్కసారి సినిమా తీస్తున్నపుడే తేడా కొడుతుంటే మంచి ఫలితం కోసం హీరోలు కూడా సలహాలిస్తుంటారు. ఒక్కోసారి ఆ సలహాలు కలిసొస్తే..ఒక్కోసారి కలిసి రావు. అయినా విజయానందం లో ఉన్న గాడ్ ఫాథర్ మీద, ఇటువంటి నిందలేసి పాతగాయాల్ని రేపడమెందుకు? సమయం వృధా!