catchక్రికెట్ లో బౌండరీ లైన్ వద్ద అనేక అద్భుతమైన క్యాచ్ లు అందుకుంటున్న వైనం ఇటీవల చాలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ చేసిన ఓ అద్భుత విన్యాసం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ‘మటడోర్ కప్‌’లో భాగంగా పెర్త్‌ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా – విక్టోరియా జట్ల మధ్య జరిగిన ఓ జాతీయ మ్యాచ్ లో మాక్స్ వెల్ చేసిన విన్యాసం క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనర్ మైకేల్ క్లింగర్ కొట్టిన భారీ షాట్ సిక్సర్ దిశగా సాగుతుండగా… బౌండరీ లైన్ వద్ద కాచుకుని కూర్చున్న మాక్స్ వెల్, గాల్లోకి ఎగురుతూ బాల్ ను అందుకుని, గాల్లో ఉంటూనే ఎదురుగా వచ్చిన రాబ్ క్వినీ అనే ఆటగాడికి అందించాడు. సిక్సర్ గా వెళ్తుందనుకుంటే, మాక్స్ ప్రతిభతో క్లింగర్ కాస్త ఔటై పెవిలియన్ కు చేరుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌ లో డక్‌ వర్త్ లూయిస్ ప్రకారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో గెలుపొందగా, మ్యాచ్ కే హైలైట్ గా మాక్స్ వెల్ క్యాచ్ నిలిచింది.