Ghost in Actress-Anjali Houseసినిమాల్లో అనేక దెయ్యాలను సిల్వర్ స్క్రీన్ పై చూస్తుంటాం కదా..! అయితే అవే నిజజీవితంలో ఎదురైతే… ఆ అనుభవం ఎలా ఉంటుంది..? అందరి విషయం ఏమో గానీ… ‘గీతాంజలి’ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన అంజలికి మాత్రం ఈ విషయం బాగా తెలిసివచ్చింది అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ వర్గాలు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలోని హీరో నాగచైతన్య ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటోంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ ఇంటికి సమీపంలో ఎక్కువగా పిల్లులు తిరుగుతుండడాన్ని అంజలి గుర్తించింది.

దీంతో ఆ ఇంట్లో దెయ్యాలేమైనా ఉన్నాయా? అన్న భయం ఆమెలో పెరిగిందని, దీనికి తోడు ఆ ఇంట్లో నుంచి అర్ధరాత్రి సమయంలో ఏవేవో వింత శబ్దాలు రావడం కూడా గుర్తించిందట. ఈ పరిణామాలతో ఆ ఇంట్లో దెయ్యం ఉందని నిర్ధారణకు వచ్చిన అంజలి… ఆ ఇంటిని ఖాళీ చేసేసిందని సమాచారం. హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కోవాలని కూడా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ‘గీతాంజలి’ సినిమాలో దెయ్యంలా కనిపించి ప్రేక్షకులను భయపెట్టిన అంజలినే నిజంగా భయపడిందంటే… నిజంగా దెయ్యాలు ఉన్నట్లేనా..?