BJP-Dents-TRS's-Strongest-Support-Base---What-Went-Wrongజీహెచ్ఎంసి ఎన్నికలలో ఓటర్లు తెరాస కు ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీకి 55 సీట్లు ఇస్తే.. రెండో స్థానంలో ఉన్న బీజేపీకి ఏకంగా 48 సీట్లు ఇచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ కంటే కూడా రెండో స్థానంలో వచ్చిన పార్టీనే ఆనందంగా ఉండబోతుంది. ఇకపోతే వచ్చే మూడేళ్ళ కాలం కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందే అని చెప్పుకోవాలి.

దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల జోష్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసే ప్రతీ పనికి అడ్డం పడుతుంది. అధికార పార్టీని గుక్కతిప్పుకోకుండా చెయ్యనుంది. అయితే ప్రచారం సందర్భంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు పదే పదే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని, ఆరు నెలలలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పే వారు.

అధికారంలో ఉన్న పార్టీ వీక్ అయినప్పుడు సొంత పార్టీ నేతలు పక్క చూపులు చూడటం సహజం… బ్యాక్ తో బ్యాక్ షాకులు తగిలాకా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండగా ఉండటంతో అది మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. దానితో కేసీఆర్ కు మునుముందు గండమే అని చెప్పుకోవాలి.

అదే సమయంలో తెరాస ఏమీ పూర్తిగా ప్రజామద్దతు లేని పార్టీ ఏమీ కాదు. కావున అటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు బీజేపీ కూడా జాగ్రత్తగానే ఉండాలి. తేడా వస్తే అసలుకే మోసం జరగవచ్చు. ఏది ఏమైనా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు ఇంత త్వరగా మారిపోతాయని ఎవరూ ఊహించివుండరు.