GEMINI TV trp rating jumps high with tagore and raja movieభారతదేశంలోని 133 కోట్ల ప్రజలు 40 రోజుల పాటు పరిమితం అయ్యారు. ఇప్పుడు లాక్డౌన్ మరో రెండు వారాల వరకు పొడిగించబడింది. థియేటర్లు మూసివేయడంతో, దేశంలోని చాలా మంది ప్రజలకు తమ ఇళ్ళలో ఉన్న టీవీలే దిక్కు అయిపోయాయి. అయితే షూటింగుల రద్దు కారణంగా ఛానెల్‌లకు కూడా కంటెంట్ అయిపోయాయి.

దీనితో వారు తమ లైబ్రరీలోని సినిమాలను మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ చిత్రాలకు కూడా మంచి టీవీఆర్ రేటింగ్స్ వస్తున్నాయి. ఈ వారం టాప్ 5 చిత్రాల టీవీఆర్ (యు + ఆర్) రేటింగ్స్ పరిశీలిస్తే – మహర్షి (8.86), విజిల్ (6.87), రాజా (6.36), ఠాగూర్ (5.61), మరియు బాహుబలి – ది కన్‌క్లూజన్ (5.02).

విక్టరీ వెంకటేష్ నటించిన రాజా (1999), మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ (2003) వంటి పాత చిత్రాలకు చాలా మంచి రేటింగ్స్ వచ్చాయని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండింటినీ జెమిని టీవీ ప్రసారం చేసింది. లాక్డౌన్ యొక్క ప్రభావం మరియు ప్రేక్షకులకు వినోదం ఎంత కరువైందో మనకు అర్ధం అవుతుంది.

దీనితో జెమినీ టీవీ చాలా కాలం తరువాత టాప్ పొజిషన్ లోకి వచ్చింది. టాప్-5 లో ఉన్న సినిమాలలో బాహుబలి 2 తప్ప అన్నీ జెమినీ టీవీవే. మరోవైపు… వరుసగా మూడు వారాల పాటు మొదటి స్థానంలో ఉన్న ఈటివి ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.